రాజకీయ నాయకులు కళాకారులు మార్కెటింగ్ వారు & అందరికి జనాకర్షణ పెరగాలంటే ఇవి చేసుకోండి

1. జిల్లేడు విత్తులను మేక లేదా గొర్రె పాలలో నూరి తిలకంగా ధరించండి.

2. తులసి విత్తనాలు, సహదేవి రసంలో నూరి తిలకం మాదిరి ధరించడం.

3. ఉసిరిక రసం లో అశ్వగంధ-మణిశిల కలిపి పెట్టుకోవడం వల్ల జనాకర్షణ పెరుగుతుంది.

4.తెల్లచందనం, తెల్ల జిల్లేడు వ్రేళ్లు నూరి లేపనం ముఖం మీద అద్దుకోవడం వల్ల జనాకర్షణ వస్తుంది.

5. ప్రభుత్వాధికారులు మనకు అనుకూలంగా ప్రవర్తించడానికో మార్గం : తులసి ఆకులు, కర్పూరం, చందనం, కుంకుమ వీటిని ఆవుపాలలో నూరి తిలకం వలె ధరించడం.

6. తెల్ల జిల్లేడును నీడన ఎండించి కపిలగోవు పాలల్లో సూరి తిలకంలా ధరించడం వలన జనాకర్షణ పెరుగుతుంది.

7. సింధూరం, గోరోజనం, కుంకుమ వీటిని ఉసిరి రసం నూరి తిలకం వలె ధరించడం.

8. మర్రిచెట్టు వేర్లు నీటిలో నూరి దానిలో విబూది కలిపి తిలకం పెట్టుకోవడం

9. మారేడు ఆకులు నీడన ఎండించి, వాటిని నూరి తెల్ల ఆవుపాలలో కలిపి తిలకం ధరించడం.

10. దానిమ్మ చెట్టు సమూలంగా నూరి, దానిలో తెల్ల గురివింద కలిపి తిలకంగా ధరించండి.

అయితే, వీటన్నిటికీ మంత్రం మాత్రం ఒక్కటే! అది – ‘ఓం నమో భగవతే రుద్రాయ, సర్వజగన్మోహనం కురు-కురు స్వాహా 10వేల మంత్ర జపం కనీసం అవసరం. దీనితోపాటు పై చెప్పిన తంత్రాలు ఏదయినా ఒకటి ఎన్నుకోవచ్చు. ఇవి చాలా వరకు ఫలిస్త్తాయి.

గమనిక : కొందరికి ప్రజాకర్షణ జన్మతః ఉంటుంది. వారికి పరిహార ప్రక్రియలతో నిమిత్తం లేదు. అయితే అది ఏ వయసులో బహిర్గతమపుతుందన్నది తెలియడం కష్టం. ఉదాహరణకు – సినిమా తారలనే తీసుకుంటే బాల్యంలోనే జనాకర్షణ (శ్రీదేవి) యువకుడిగా ఉండగా (చిరంజీవి) నడివయసున (రజనీకాంత్) దశలో (జె.వి.సోమయాజులు) గొప్ప ప్రజాదరణ పొందారు. ఇది సిద్ధంగా లభించినది – అందరికీ తేలికగా అర్థం అవుతుంది చెప్పిన ఉదాహరణ మాత్రమే.

 

సహజ ప్రజాకర్షణ ఏ దశలో బయల్పడుతుందనేది సంశయగ్రస్తమై నపుడు పై రెమెడీలు ఆచరిస్తే మంచిది. ఒకవేళ సహజంగా వుంటే ఈ ప్రక్రియలవల్ల అది ఇనుమడిస్తుంది. అంతే గాక ఇవి పెద్ద ఖర్చుతో కూడినవి కాదు కాబట్టి మీరు చేసుకొని, మీ పనులలో విజయం సాధిస్తారు అని ఆశిస్తున్నా.

 

About Ashok Kanumalla

Ahsok

Check Also

వివాహం అలస్య మవుతోందా ? మీరు అనుకున్న వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇలా చెయ్యండి

1. పార్వతి దేవిని ఆరాధించాలి. 2. ఎర్రని మరియు నల్లని దుస్తులు ధరించవద్దు. 3. మీ ఆలోచనలను ఇతరులకు వెల్లడించవద్దు. …

4 comments

  1. అక్షింతల పార్థసారథి

    Nice in formation

    Good night

    Ashok Kumar

  2. Super information unbelivable

  3. Valuable information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *