rama sabha telugu – రామ సభ

rama sabha in telugu
lord sri rama sabha telugu

 

 

రాజసభ, రఘు రామసభ
సీతా కాంత కల్యాణ సభ |
అరిషడ్వర్గములరయు సభ
పరమపదంబును ఒసగు సభ ‖ (రాజసభ)

వేదాంతులకే జ్ఞాన సభ
విప్రవరులకే దాన సభ |
దుర్జనులకు విరోధి సభ
సజ్జనులకు సంతోష సభ ‖ (రాజసభ)

సురలు, అసురులు కొలచు సభ
అమరులు, రుద్రులు పొగడు సభ |
వెరువక హరివిల్లు విరచు సభ
జనకుని మది మెప్పించు సభ ‖ (రాజసభ)

భక్తి జ్ఞానములొసగు సభ
సృష్టి రహితులై నిలచు సభ |
ఉత్తమ పురుషుల ముక్తి సభ
చిత్త విశ్రాంతినొసగు సభ ‖ (రాజసభ)

గం-ధర్వులు గానము చేయు సభ
రం-భాదులు నాట్యములాడు సభ |
పుష్ప వర్షములు కురియు సభ
పూజ్యులైన మునులుండు సభ ‖ (రాజసభ)

About Ashok Kanumalla

Ahsok

Check Also

Anjaneya Sahasranama Stotram in Telugu- ఆంజనేయ సహస్రనామ స్తోత్రం

    ఓం అస్య శ్రీహనుమత్సహస్రనామస్తోత్ర మన్త్రస్య శ్రీరామచన్ద్రఋషిః  అనుష్టుప్ఛన్దః శ్రీహనుమాన్మహారుద్రో దేవతా  హ్రీం శ్రీం హ్రౌం హ్రాం బీజం  …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *