Breaking News

శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి) ఎద్దువాహనంపై అద్భుతమైన చిత్రాలు

 

శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి): దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి.

ఈ రోజు అమ్మవారికి కట్టే నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

బాలా త్రిపుర సుందరి దేవి గా గృహంలో పూజించే వారు శైలపుత్రి స్త్రోత్రం , అష్టోత్తరం తో అర్చన చేయాలి. లలితా సహస్త్ర నామం చదివి నివేదించి హారతి ఇవ్వాలి.

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమ్

కాశీలోని అలయిపురలో శైలపుత్రి ప్రాచీన దేవాలయం ఉంది. నవరాత్రి తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా అమ్మవారిని దర్శించి పూజలు జరిపితే కోరిన కోర్కెలన్నీ తీరుతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వైవాహిక సమస్యలన్నీ తీరిపోతయాని నమ్ముతారు. అందువల్లే నవరాత్రి రోజుల్లో ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు.

 

 

About Ashok Kanumalla

Ahsok

Check Also

బంగారు వర్ణంతో అద్భుతమైన దశ సహస్ర లింగేశ్వరుడు

  రావణాసురుడు ప్రతిరోజు కోటి శివలింగానికి పూజ చేసే వారట ! ప్రతి ఒక్కరూ అన్ని శివలింగాలు పూజ చేయడం …

6 comments

  1. Sri maathery namaha

  2. మోహన్ కిషోర్ నిమ్మా

    🙏🙏🙏

  3. మంచి వివరణ ఇచ్చినందుకు, ధన్యవాదములు

  4. Saia putri namo namaha

  5. మల్లికార్జున రావు ఊరందూరు

    శ్రీ మాత్రే నమః

  6. Jai mata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *