ఇంటీరియర్ డిజైనింగ్‌లో కూడా వాస్తును పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేసుకోవచ్చు. మనం ఉండే ఇంట్లో మనకు సానుకూలమైన దిక్కులు, ప్రతికూల దిక్కులూ ఉంటాయి. సానుకూలమైన వాటిని సాధ్యమైనంత తేలికగా ఉంచడం మంచిది. ఇంట్లో ఫర్నిచర్ సర్దుకునేప్పుడు భారీగా ఉండే దానిని ప్రతికూల ప్రాంతంలోనూ, తేలికపాటివి సానుకూల ప్రాంతాల్లోనూ సర్దుకోవడం మంచిది. ఈ రోజు వాటిని ఎక్కడ పెడితే మంచిదో తెలుసుకుందాం.
మన ఇంటిలో సాధారణంగా ప్రతికూల జోన్లు దక్షిణంలో, పశ్చిమంలో, నైరుతిలో ఉంటాయి. కనుక బరువైన ,పెద్దవి అయిన సామాన్లు అక్కడ సర్దుకుంటే మంచిది అని వాస్తు శాస్తవ్రేత్తలు అంటున్నారు.
1. ఇంటిలో డ్రాయింగ్ రూంలో సోఫాను వేసేటప్పుడు గదిలోని పడమర లేక దక్షిణ దిక్కులో వేసుకోవాలి. ఆ సోఫా లో కూర్చున్న వ్యక్తి తూర్పు లేక ఉత్తర ముఖంగా ఉండాలి.
2. ఇంటిలో బెడ్రూంలో మంచాన్ని నైరుతి మూలను వదిలేసి నైరుతి దిక్కులో వేసుకోవాలి.తూర్పు వైపు కాళ్ళు వుండేటట్టు పెట్టుకుంటే మంచిది.
3. విలువైన నగలు, డబ్బు పెట్టే బీరువాలను వాయువ్యంలోనే పెట్టుకోవాలి. దాని తలుపులు దక్షిణముఖంగా ఉండేలా పెట్టుకోవాలి.బట్టలు లేక ఇంకేమి అయిన పెట్టిన బీరువాలు అయితే నైరుతి పక్క పెట్టుకుంటే మంచిది.
4. వంటింట్లో కానీ, డైనింగ్ హాల్లో కానీ డైనింగ్ టేబుల్ వేసుకునేటప్పుడు దానిని గదికి వాయువ్య దిక్కులో ఉండేట్టుగా చూసుకోవాలి.రైస్ కారకుడు చంద్రుడు కాబట్టి తిన్న ఆహారం ఒంటపడుతుంది అని వాస్తు నిపుణులు అంటున్నారు.
5. స్టడీ టేబుల్‌ను గదికి ఉత్తర లేదా తూర్పు దిక్కున వేసుకోవాలి.అపుడు చదువు మీద ఇంటరెస్ట్ పెరుగుతుంది.
6. డ్రాయింగ్ రూంలో పెట్టుకునే అక్వేరియంను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిక్కులలో పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో నీరు ఉంటుంది కనుక పైన పేర్కొన్న దిక్కులు నీటికి సంబంధించినవి కనుక అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అని వారి సూచన.
7. పెయింటింగ్స్, శిల్పాలు: ఇంట్లో ప్రకృతి సహజమైన సూర్యోదయం, జలపాతం వంటి చిత్రాలు పెట్టుకోవడం మంచిదని వాస్తు చెప్తుంది. యుద్ధాలకు సంబంధిం చిన, హింసాత్మకంగా ఉండే చిత్రాలను ఇంట్లో ఉంచకపోవడమే మంచిది. అలాగే బెడ్రూంలో దేవుని పటాలు పెట్టుకోకూడదు. అలాగే ఇంట్లో ఏ గదిలోనైనా ఈశాన్యంలో భారీ శిల్పాలను పెట్టుకోక పోవడమే మంచిది.ఎందుకంటే ఈశాన్యం ఎప్పుడు ఖాళి ఉంటే మంచిది కదా.
కాబట్టి ఎలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు ఇంట్లో చేసుకుంటే మీ జీవితం సుఖమయం అవుతుంది.
ఇంట్లో ఫర్నిచర్ ఏ ఏ స్థానంలో ఉండాలో తెలిపినందుకు ధన్యవాదాలు
🙏🙏🙏
Wow superrrr information 👌👌👌👌 for interior decoration Tq sir
Vaastu తెలియాల్సి ఉంది.
చాలామందికి తెలియని విషయాలు చాలా చక్కగా వివరించి చెప్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది అద్భుతమైన విషయాలు తెలుసుకో గలుగుతున్నందుకు
మీ గ్రూపులో జాయిన్ అయినా మేమందరం చాలా అదృష్టవంతు లం శుభరాత్రి అశోక్ కుమార్ గారు