Subrahmanya Kavacham stotram in telugu- సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం

Subrahmanya Kavacham stotram in telugu
sree Subrahmanya Kavacham stotram in telugu

మంగళవారం కుమార స్వామిని(సుబ్రహ్మణ్య స్వామి) ఆరాధించినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వాస్తు దోషాలు, సర్ప దోషాలు వీడిపోతాయి. సుబ్రహ్మణ్యుని చేతిలో ఉన్నటువంటి ఆయుధము శక్త్యాయుధము.ఆ ఆయుధంలో రెండు విశేషములున్నాయి. జ్ఞానము, శక్తి రెండు చెప్పబడుతున్నాయి. అసలు జ్ఞానానికే పెద్ద శక్తి ఉంది. ఎంతటి శక్తి ఉంది అంటే ఎవరూ ఛేదించలేని అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానముయొక్క శక్తి. అలా జ్ఞానశక్తి ఆయనయొక్క ఆయుధం. ఇది భావన చేసినప్పుడు ఆయన గురుస్వరూపంగా కనిపిస్తాడు.

సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం చదవడం వలన మీకు వున్నా భాదలు అన్ని తొలగిపోతాయి. పనులలో వున్నా ఆటంకాలని అధిగమించవచ్చు .

ఆ ఆయుధంతో చెల్లాచెదురైనటువంటి దేవసేనలన్నింటినీ సమీకరించి వారందరికీ తాను బలమై, బలాన్ని ఇచ్చి నడిపించి అసుర శక్తులను సంహరించాడు.  కాబట్టి అలాంటి సుబ్రహ్మణ్య స్వామిని మనం పూజించితే మనకు జ్ఞానము శక్తి రెండూ లభిస్తాయి. మనకి ఆయన కవచంలా ఉంటాడు.
కాబట్టి ఈ రోజు “సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం”చదివినా, వినిన మనకు జ్ఞానం, శక్తి లభిస్తాయి.

అస్య శ్రీ సుబ్రహ్మణ్యకవచస్తోత్రమహామంత్రస్య బ్రహ్మ ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీ సుబ్రహ్మణ్యో దేవతా | ఓం నమ ఇతి బీజమ్ | భగవత ఇతి శక్తిః | సుబ్రహ్మణ్యాయేతి కీలకమ్ | శ్రీ సుబ్రహ్మణ్యప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||

కరన్యాసః –
సాం అంగుష్ఠాభ్యాం నమః
సీం తర్జనీభ్యాం నమః
సూం మధ్యమాభ్యాం నమః
సైం అనామికాభ్యాం నమః
సౌం కనిష్ఠికాభ్యాం నమః
సః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

అంగ న్యాసః –
సాం హృదయాయ నమః
సీం శిరసే స్వాహా
సూం శిఖాయై వషట్
సైం కవచాయ హుం
సౌం నేత్రత్రయాయ వౌషట్
సః అస్త్రాయ ఫట్
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||

ధ్యానం |
సిందూరారుణమిందుకాంతివదనం కేయూరహారాదిభిః
దివ్యైరాభరణైర్విభూషితతనుం స్వర్గాదిసౌఖ్యప్రదమ్ |
అంభోజాభయశక్తికుక్కుటధరం రక్తాంగరాగోజ్జ్వలం
సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం భీతిప్రణాశోద్యతమ్ ||

సుబ్రహ్మణ్యోఽగ్రతః పాతు సేనానీః పాతు పృష్ఠతః |
గుహో మాం దక్షిణే పాతు వహ్నిజః పాతు వామతః || ౧ ||

శిరః పాతు మహాసేనః స్కందో రక్షేల్లలాటకమ్ |
నేత్రౌ మే ద్వాదశాక్షశ్చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్ || ౨ ||

ముఖం మే షణ్ముఖః పాతు నాసికం శంకరాత్మజః |
ఓష్ఠౌ వల్లీపతిః పాతు జిహ్వాం పాతు షడాననః || ౩ ||

దేవసేనాపతిర్దంతాన్ చుబుకం బహుళోద్భవః |
కంఠం తారకజిత్పాతు బాహూ ద్వాదశబాహుకః || ౪ ||

హస్తౌ శక్తిధరః పాతు వక్షః పాతు శరోద్భవః |
హృదయం వహ్నిభూః పాతు కుక్షిం పాత్వంబికాసుతః || ౫ ||

నాభిం శంభుసుతః పాతు కటిం పాతు హరాత్మజః |
ఊరూ పాతు గజారూఢో జానూ మే జాహ్నవీసుతః || ౬ ||

జంఘే విశాఖో మే పాతు పాదౌ మే శిఖివాహనః |
సర్వాణ్యంగాని భూతేశః సర్వధాతుంశ్చ పావకిః || ౭ ||

సంధ్యాకాలే నిశీథిన్యాం దివాప్రాతర్జలేఽగ్నిషు |
దుర్గమే చ మహారణ్యే రాజద్వారే మహాభయే || ౮ ||

తుములేఽరణ్యమధ్యే చ సర్వదుష్టమృగాదిషు |
చోరాదిసాధ్యసంభేద్యే జ్వరాదివ్యాధి పీడనే || ౯ ||

దుష్టగ్రహాదిభీతౌ చ దుర్నిమిత్తాది భీషణే |
అస్త్రశస్త్రనిపాతే చ పాతు మాం క్రౌంచరంధకృత్ || ౧౦ ||

యః సుబ్రహ్మణ్య కవచం ఇష్టసిద్ధిప్రదం పఠేత్ |
తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహమ్ || ౧౧ ||

ధర్మార్థీ లభతే ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ |
కామార్థీ లభతే కామం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ || ౧౨ ||

యత్ర యత్ర జపేద్భక్త్యా తత్ర సన్నిహితో గుహః |
పూజాప్రతిష్ఠకాలే చ జపకాలే పఠేదిదమ్ || ౧౩ ||

సర్వాభీష్టప్రదాం తస్య మహాపాతకనాశనమ్ |
యః పఠేచ్ఛృణుయాద్భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ || ౧౪ ||

సుబ్రహ్మణ్య ప్రసాదేన హ్యపమృత్యుః స హరతే |
ఆయురారోగ్య ఐశ్వర్యం పుత్రపౌత్రాదివర్ధనమ్ |
సర్వాన్కామానిహః ప్రాప్య సోఽంతే స్కందపురం వ్రజేత్ || ౧౫

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రమ్ |

 

Subrahmanya Kavacham stotram Importance

Ashtaishwaryas are offered if Kumara SwamiSubramanya Swami ) is worshiped on Tuesday. Vastu bugs, serpent bugs will go away. The weapon in Subrahmanya’s hand is a powerful weapon. There are two features in that weapon. Wisdom and power are both said. Original knowledge itself has great power. What power there is the power of knowledge to pierce ignorance that no one can pierce. So cognition is his weapon. He looks like a guru when it makes sense.

 Subramanya Kavacha Stotram removes all the worries you have. Obstacles in work can be overcome

With that weapon, he mobilized all the scattered devas and gave strength and strength to all of them, and led them to slay the demonic forces. So if we worship such Subramanya Swami we will get both knowledge and power. He is like a shield to us.
So even if we read “Subramanya Kavacha Stotram” today, we who hear it will get knowledge and strength.

About Ashok Kanumalla

Ahsok

Check Also

Anjaneya Sahasranama Stotram in Telugu- ఆంజనేయ సహస్రనామ స్తోత్రం

    ఓం అస్య శ్రీహనుమత్సహస్రనామస్తోత్ర మన్త్రస్య శ్రీరామచన్ద్రఋషిః  అనుష్టుప్ఛన్దః శ్రీహనుమాన్మహారుద్రో దేవతా  హ్రీం శ్రీం హ్రౌం హ్రాం బీజం  …

2 comments

 1. ఊరందూరు మల్లికార్జునరావు

  కృతజఞతలతో

  • అక్షింతల పార్థసారథి

   అబద్ధం చెప్పటానికి తెలివి ఉండాలి, నిజం చెప్పటానికి ధైర్యం ఉండాలి నిజమేఅయినా అది ఇతరులకు నొచ్చుకోకుండా చెప్పటానికి గొప్ప సంస్కారం ఉండాలి.🦜
   ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు, నటించటం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళలా

   మిగిలిపోతున్నారు.

   శుభోదయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *