ఈ కార్తీక మాసం శివుడు,విష్ణువు ఇరువురి కి విశేషమైన మాసం .కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, దీపాలు, క్షేత్ర దర్శనం, ఆహార నియమం, దానాలు, దీప దానం, దైవ నామ స్మరణ విశేష ఫలితం ఇస్తుంది అని మన పూర్వీకులు చెప్పారు. కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన, శనివారం విష్ణు ఆరాధన చాలా మంచిది. నాగులు చవితి , కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక మాసంలో ఆదివారములు చేసే పూజలు చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారం మాంసం తినకుండా కులదేవతను ఉపాసించాలి. ఆదివారం రాత్రి అన్నం తినకుండా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు.
1. అంతే కాకుండా జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ మాసం అంతా దానికి సంబంధించిన స్త్రోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేష మైన ఫలితం లభిస్తుంది. కుజ దోషం ఉన్న వాళ్ళు , వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ మాసమంతా సుబ్రహ్మణ్య స్త్రోత్రం చదవాలి.
Sri Subrahmanya stotram in telugu-శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం
2. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం తో బాధపడే వాళ్ళు, బైద్యనాద్ స్త్రోత్రం,ఆదిత్య హృదయం పఠించాలి రోజు పఠించాలి.
ఆదిత్య హృదయం – adityahrudayam in telugu
3. వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో కలహాలు, ధన విషయంలో అప్పులు ,తగాదాలవల్ల కోర్ట్ కేసులు, అపనిందలు , రాహు గ్రహ దోషాలు ఉన్న వారు మంగళ చండికా స్త్రోత్రం చదవుకోవాలి.
Mangala Chandika Stotram in Telugu-మంగళచండికా స్తోత్రం
4. మంత్ర సాధన చేస్తున్న వాళ్ళు, కొత్తగా దీక్ష తీసుకుని ఉపాసన చేస్తున్న వాళ్ళు చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి ఉన్న వారు ఈ మాసం మొత్తం మనసా దేవీ స్త్రోత్రం చదవుకోవాలి.
Manasa Devi Stotram (Mahendra Krutam) Telugu-మనసా దేవీ స్తోత్రం
5. మీకు నేత్ర వ్యాధులు, ఏదైనా మీపైన ప్రయోగం జరిగింది అని అనుమానం ఉన్న వాళ్ళు, ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడ ప్రయోగ మంత్రం చదవుకోవాలి.
Garuda Prayoga Mantram in Telugu-గరుడ ప్రయోగ మంత్రం
6. మీకు శత్రు బాధలు ఉంటే అమ్మవారు స్తోత్రం అంటే దుర్గా స్త్రోత్రం రోజు పఠించాలి.
Durga stotram in Telugu-దుర్గా స్తోత్రం
7. ఇంట్లో ఏదైనా శుభకార్యము జరగాలి అని కోరుకునే వారు లలితా సహస్త్ర నామం పఠించాలి.
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమ్ – sri lalitha sahasra nama sthotram in telugu
8. కొత్త ఇల్లు కొనాలి అనుకునే వారు మణిద్వీప వర్ణన చదువుకుంటే మంచిది.
Manidweepa Varnana in Telugu-మణిద్వీపవర్ణన
9. భూమి అమ్మాలి అనుకునే వాళ్ళు గణేశ ప్రార్థన చెయ్యాలి. భూమి కొనాలి అనుకునే వాళ్ళు లక్ష్మీ వరాహ స్వామి ప్రార్థన శ్లోకం చదువుకోవాలి.
10. ఉద్యోగం ,ప్రమోషన్ కోరుకునే వాళ్ళు కనకధార స్త్రోత్రం చదువుకుంటే మంచిది.
కనకధారా స్తోత్రమ్ – kanakadhara sthotram in telugu
11. రాజకీయ నాయకులు, పోలీసు శాఖ వాళ్ళు, క్రీడా రంగం వాళ్ళు, వారాహి కవచం చదువుకోవాలి.
Varahi Kavacham in Telugu-వారాహీ కవచం
Kirata Varahi Stotram in Telugu-కిరాత వారాహీ స్తోత్రమ్
12. సినిమా రంగం లేదా నాటక రంగంలో ఉన్నవాళ్లు, వైద్య వృత్తిలో ఉన్న వారు ప్రత్యంగిరా, నరసింహ స్త్రోత్రలు ఈ మాసంలో నియమంగా ఈ కార్తీక మాసం మొత్తం పారాయణ చేయాలి.
13. విద్యార్థుల సర్వస్వతీ , హాయగ్రీవ, వినాయక స్త్రోత్రలు చదవాలి అలా చదివిన విద్య బాగా వస్తుంది.
Ganesh Stotras in Telugu-గణేశ స్తోత్రాలు
Hayagriva Stotram in Telugu-హయగ్రీవ స్తోత్రం
14. అన్ని విధాలా భయాలను తొలగించి కార్యసిద్ధి కలగాలి అనుకుంటే హనుమాన్ చాలీసా చదువుకోండి.
హనుమాన్ చాలీసా – hanuman chalisa in telugu
15 . మీరు ఆధ్యాత్మిక జ్ఞానం, దైవనుగ్రహం కోసం ఈ మాసం మొత్తం దామోదర అష్టకం ప్రతి రోజూ చదవటం మంచిది.
Damodarashtakam in Telugu-దామోదరాష్టాకం
16. కార్తీక మాసం మొత్తం గడపలో దీపాలు పెట్టాలి. తులసి కోటలో దీపం పెట్టాలి, ఉదయం సూర్యోదయానికి ముందు పెట్టె దీపాలు విష్ణు మూర్తికి చెందుతుంది, సంధ్యకాలం ఆరు పైన పెట్టే దీపాలు శివయ్యకు చెందుతుంది. అఖండ దీపారాధన చేసే వాళ్లకు ఈ మాసం చాలా విశేషం.కాబట్టి మీకు చెప్పిన శ్లోకాలు చదువుకొని మీరు అనుకున్న ఫలితం పొందగలరు అని ఆశిస్తున్నాను.
Good information
Kartheeka Masamlo Ye Devuniki Yelanti Pooja Cheyalo Chala Vivaramga Cheppinanduku Meeku Danyavadhamulu.
Good information 👌👌👌👌 om namah shivaaya
కార్తీక మాసంలో వచ్చే శివరాత్రి సందర్భంగా ఏ విధంగా శివారాధన
చేయాలో మరియు ఏ ఏ రోజుల్లో ఏ ఏ విధమైన పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని స్వామిజీగారు చాలా మందికి తెలియని విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను
మంచి విశేషన అందించారు, ధన్యవాదాలు…
ఓం జై జగదీశా హరే….
Good information ashok
Asala spr ga chepparu
Ae deepam aevariki chendutundokuda chepparu
మీరు చాలా మంచి విషయాలు తెలియచేశారు సార్