ఐశ్వర్య దీపం అంటే ఏంటి ? ఐశ్వర్య దీపం పెడితే ధనం వస్తుందా ? ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి ?

ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం, ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకోండి.

మీ దగ్గర సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది, అప్పులు తీరకుండా వడ్డీ పెరిగి పోతూ ఉంటుంది, వ్యాపారం లో లాభాలు లేనివారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టివల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి , అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం అనగా ” ఉప్పు దీపం ” పెడితే మంచిది.

ఈ ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి తెలుసుకుందాం…

ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు 2 తీసుకొని పసుపుకుంకుమ రాసి నేలపైన బియ్యం పిండి పసుపు కుంకుమ తో ముగ్గు వేసి దానిపైన ప్రమిధలు ఒకదాని పైన ఒకటి పెట్టి, అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైనపసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిధలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపుకుంకుమా పూలు పెట్టి ప్రమిధలో నూనె కానీ నేయి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి, దీపం శ్లోకం చదువుకోవాలి. పళ్ళు కానీ, పాలు పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి , లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి, కనకధార స్త్రోత్రం కూడా చదివాలి.

శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధలు లోని ఉప్పు మటుకు తీసి నీటిలో కలిపి ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి. లేదా అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు, ప్రమిధలు మార్చాల్సిన పని లేదు. ప్రతి వారం అవి వాడుకోవచ్చు ,ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి.అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకోని ఇంట్లో చేయాలి.

ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది. 41 శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే చాలా మంచిది.

కాబట్టి ఈ ఐశ్వర్య దీపాన్ని ప్రతి ఒక్కరు పెట్టుకొని ధనానికి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఆనందాన్ని పొందండి. ఇది పెద్ద ఖర్చు లేని పని కాబట్టి ప్రతి ఒక్క హిందువు చేసుకుంటారని ఆశిస్తున్నాను.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

6 comments

  1. Good information

  2. హరి ఆలేటి

    👍👍👍👍👌👌

  3. చాల బాగా చెప్పారు ఐశ్వర్య దీపం గురించి ధన్యవాదాలు

  4. Uppu deepam gurinchi cheppinanduku danyavadhamulu meeku

  5. మంచివిషయం చెప్పారు. ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *