కోటి సోమవారం అంటే ఏమిటి ?ఈ కోటి సోమవారం రోజు ఏ నియమాలు పాటించాలి

 

కోటి సోమవారం రోజు చేసే స్నాన, దాన, ఉపవాసం ఏదైనా కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. అంటే ఒకసారి చేస్తే కోటి సార్లు చేసినట్లు లెక్క అని అర్థము . ఉపవాసం అనగా దగ్గరగా నివశించడం. ఉప అంటే ‘దగ్గరగా’, వాసం అంటే ‘నివశించడం’ అని అర్థం. పర్వదినాలలో ఉపవాసం ఉండటమంటే, భగవంతునికి దగ్గరగా నివసించడం . ఉపవాసం ఉండాలనుకున్న రోజు భగవంతునిపై మనస్సు లగ్నం చేయాలి, ఆహార, పానీయాలను తీసుకోకుండా (లేదా) కొద్ది మొత్తంలో తీసుకుని భగవన్నామ స్మరణ చేస్తూ ఆ రోజంతా ఉండాలి.

 

మనం నిష్కామంగా ఉపవాస దీక్షను చేయగలిగితే, భగవంతుడు మన కోరికలను అడగకుండానే నేరవేరుస్తాడు. మన శరీరానికి అలసట కలిగితేనే మనసు స్థిరపడుతుంది. మనస్సు స్థిరపడి నిగ్రహాన్ని పొందితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందినప్పుడే ఓ మనిషి తనని తాను తెలుసుకుంటాడు. తనని తాను తెలుసుకోవడమంటేనే దైవం గురించి తెలుసుకోవడమే. ఆవిధంగా దేవునికి సన్నిహితంగా,దగ్గరగా నివసింపచేసేదే “ఉపవాసం” .

 

ఇంకా ఇంద్రియనిగ్రహం కలిగి ఉండడం, మితాహారాన్ని భుజించడం – ఈ రెండూ ఉపవాస దీక్షకు చాలా ముఖ్యం. మనం ఇష్టపూర్వకంగా, ఎవరి బలవంతం మీదనో కాక స్వతంత్రంగా ఉపవాసం ఉండడం వల్ల మనకు తెలియకుండానే మన మనస్సు, శరీరం ఓ క్రమశిక్షణకు అలవాటు పడతాయి. ఈ ఉపవాస దీక్షను అనుసరించదలచిన వారికి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఉపవాస దీక్ష చేస్తున్న రోజును ఎంతో పవిత్రమైన దినంగా భావించాలి. సాంసారిక, రాజకీయాది బాహ్య వ్యాపారాలన్నిటినీ వీలైనంత మేరకు మనసా, వాచా, కర్మణా త్యజించాలి. కేవలం ఆధ్యాత్మిక చింతనతో ఆ రోజంతా గడపాలి గడపాలి.

 

ఈ ఉపవాస వ్రతాన్ని అనుసరిస్తున్న రోజున మౌనం పాటించడం ఉత్తమం. అది వీలు కుదరకపోతే, కనీసం మితంగా మాట్లాడాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థించడం, జపం చేయడం. మౌనవ్రతం పాటించడం, భజనలు పాడుకుంటూ రాత్రిపూట జాగారం చేయడం చాలా మంచిది. అసలు ఉపవాసమంటే, వండిన ఆహార పదార్థాలను తినకూడదు. పాలు, పండ్ల లాంటి వండని ఆహార పదార్థాలు కొద్దిగా తీసుకోవచ్చు. కొంతమంది పచ్చి గంగైనా ముట్టకుండా, ఉపవాసం ఉంటారు. తట్టుకోగల శక్తి ఉంటే అలా ఏమీ తినకుండా, తాగకుండా కూడా ఉపవసించవచ్చు.

 

ఈ ఉపవాస దీక్ష రోజున వయసు,ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకుని పండ్లను పాలను స్వీకరిస్తూ పూర్తిగా దైవ చింతనలోనే దీక్షా సమయాన్ని గడపాలి. అయితే, వృద్ధులు, శారీరకంగా బలహీనులు, రోగులు, చిన్న పిల్లలు ఉపవాసం చేయాల్సిన పని లేదు. ముసలి వారికి, బ్రహ్మచారులకు, చిన్నపిల్లలకు ఉపవాస దోషం లేదు. ఎందుకంటే ముసలివాళ్ళు చిన్నపిల్లలు ఆకలికి తట్టుకోలేరు. కాబట్టి వారు కేవలం భక్తి చేస్తే సరిపోతుంది అంటే భజనలు దైవ దర్శనాలు చేసుకుంటూ మామూలు భోజనం కూడా తినవచ్చు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

దీపావళి నరక చతుర్దశి రోజున ఈ స్తోత్రం పఠించిన మీ కోరికలన్నీ తీరుతాయి

  ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉన్న ఫోటో ఉండకూడదు. లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ …

5 comments

 1. మల్లికార్జున రావు ఊరందూరు

  Gd info

 2. ఉపవాసం గురించి చాల చక్కగా వివరించారు సార్

 3. Good msg sir nice information 👌👌👌👌👌

 4. Superrrrr ga chaparu anna garu

 5. అక్షింతల పార్థసారథి

  *శుభరాత్రి*
  *సభ్యులందరికీ*
  హర హర మహాదేవ శంభో శంకర
  చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం అశోక్ కుమార్ గారు మీ దయవల్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *