నవరాత్రుల విశిష్టత ఏమిటి ? నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలి

నవరాత్రులంటే తొమ్మిది రాత్రులు. మనం స్త్రీ-పురుషదేవతల్ని వేర్వేరుగా పూజిస్తాం కానీ ఆ ఇద్దరూ ఒకటే అందుకే కాళిదాస మహాకవి “వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” అంటూ శిరస్సు వంచాడు. సంఖ్యలన్నింటిలోకి ‘తొమ్మిదవ’ సంఖ్య దైవసంఖ్యగానూ, బ్రహ్మ సంఖ్య గానూ చెబుతారు. ఆశ్వయుజంలో దేవీ నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు అన్నీ తొమ్మిది రాత్రులు జరిపే దైవోత్సవాలే! తిరుమల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు కూడా తొమ్మిది రోజులే జరుపుతారు కదా.

మన మహర్షులు, తపస్వులు, యతులు, వాస్తు నిపుణులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, ఆగమ శాస్త్ర పండితులు, వైదికాచార్యులు, అందరూ తొమ్మిదిని దైవశక్తి సంఖ్య గానే భావించి గౌరవించటం అందరికీ తెల్సిందే కదా.

భాద్రపద ఆశ్వయుజ మాసాలలో ఆచరించే నవరాత్రులు శ్రేయోదాయక మైనవి. ఎందుకంటే క్రొత్త నీటితో నదీనదాలు ఎంతో కొంత కల్మషపూరితంగా ఉంటాయి. అనారోగ్యాన్ని ఉదర సమస్యలను కల్గిస్తుంటాయి. ఈ మాసాల్లో దేహశ్రమ తక్కువగానూ ఆకలి ఎక్కువగానూ వుంటుంది. శాఖాహారాల్లో క్రిములు కనబడకుండా వుండి ఆహారం ద్వారా కడుపులోనికి ప్రవేశించి అనారోగ్య కారకాలు అవుతుంటాయి. కాబట్టి గణపతి నవరాత్రులనూ దేవీ నవరాత్రులను దగ్గర దగ్గరగా ఈ మాసాలలోనే నియమించటం జరిగింది. ముఖ్యంగా రాత్రులలో జరిపే ఈ నవరాత్రుల పూజోపాసన కార్యక్రమాలకు తప్పనిసరిగా ఉపవాసం వుండి తీరాలి. రాత్రి సమయాలు భోజనం నిషిద్ధం. ఈ వుపవాసక్రియ వలన శరీరం శక్తిని పుంజుకొంటుంది. ‘దేహదండన’ వల్ల తమోశక్తి హరించి దివ్యతేజస్సు నరనరాలకు ప్రాకుతుంది. ఆయుః శక్తి వృద్ది చెందుతుంది.

శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలల్లో ఎక్కువగా ప్రతాలు పూజలు వుపవాసాలు పుణ్యస్నానాలు ఏర్పరచటంలోని మూల వుద్దేశ్యం యిదే . మార్గశిర మాసానికి మనిషి బలంగా స్థిరంగా వుంటాడు గాబట్టి మార్గశీర్ష మాసాన్ని విష్ణుమాసంగా చెబుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ “మాసానాం మార్గశీర్షోహం” అంటాడు. పన్నెండు మాసాలలో మార్గశిర మాసం విష్ణుప్రియ మైనది అని అర్థం.

శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ కార్తీకాలు నాలుగు స్త్రీల ప్రతాలకు నోములకు, ఉపవాసాలకు సంబం భించిన నెలలే! ఈ నాలుగు నెలల కాలం స్త్రీలు భగవత్కార్యాలలో పవిత్రంగా ఉండి పురుషుడు దూరంగా వుండటంవల్ల ఎండలు మంటలు ‘రేపే వైశాఖమాసంలో కాన్సు రాకుండా తప్పించవచ్చుననే మహర్షుల దూరదృష్టికి శతకోటి వందనాలు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

నాగుల చవితి రోజు పూజ ఎలా చేసుకోవాలి ? నాగుల చవితి రోజు పూజ చేసుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి

వెలుగుల దీపావళి తరువాత వచ్చే కార్తీకశుద్ధ చవితిని నాగుల చవితి పండుగ అంటారు. నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు …

4 comments

  1. హరి ఆలేటి

    పండగలు వాటి విశిష్టత. మంచి సమాచారం

  2. చాల.వివరంగా నవరాత్రుల గురించి చెప్పారు సంతోషం

  3. Excellent information 👌👌👌👌👌 for Devi navaraathrulu Tq

  4. మోహన్ కిషోర్ నిమ్మా

    శ్రీ మాత్రేనమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *