Breaking News

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మూడు రూపాలతో ఎపుడు చూడవచ్చు ?శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చేతులు ఎందుకు అలా ఉంటాయి ?

1. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మూడు రూపాలతో ఎపుడు చూడవచ్చు ?

గురువారంనాడు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు మూడు రూపాలతో దర్శనము ఇస్తాడు. గురువారం ఉదయం రెండవ అర్చన అయిన తర్వాత శ్రీ వేంకటేశ్వరుడు ఆభరణాలూ, అలంకరణలూ లేకుండా దర్శనమిస్తాడు. నొసటన సన్నని నామము మాత్రం ఉంటుంది. ఆ సమయంలో స్వామి వారి నేత్రాలని దర్శించి తరించవచ్చును. రాత్రి తోమాలసేవ అయిన తర్వాత పూలంగి సేవలో దర్శన మిస్తారు. అనగా గురువారం ఉదయం సకలాభరణములతోనూ రెండవ అర్చన తర్వాత అభరణాలు లేకుండా రాత్రికి పుష్పాలంకరణతో దివ్య దర్శనాన్ని భక్తులకు అందిస్తారు స్వామి వారు.

2. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చేతులు ఎందుకు అలా ఉంటాయి ?

శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించిన వారికి స్వామివారు చేతులు ఉండే తీరు విచిత్రంగానే గోచరిస్తుంది. స్వామివారి చేతులు భూమిని చూపిస్తున్నట్లు ఉంటాయి. ఆ భంగిమకు అర్ధం ఏమిటంటే తనను తన పాదాలను శరణువేడిన భక్తులకు భూలోకంలో దారిద్ర్యం అంటూ ఉండదని నమ్మకం. ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం లో కూడా ఉన్నది. ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు శ్రీవేంకటేశ్వరస్వామిని తనివితీరా చూడండి అపుడు గమనించండి.

3. తిరుమల  శ్రీవెంకటేశ్వర సుప్రభాతాన్ని ఎవరు రచించారో తెలుసా ?

శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని రచించినది శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్ ఆచార్యులవారు. శ్రీప్రతివాది భయంకర అణ్ణన్ అనే ఆయన మళయాళ మహామునుల శిష్యుల్లో ముఖ్యమైనవారు. వీరు క్రీ.శ. 1361 నుంచి 1454 వరకూ జీవించి అనేక కృతులు రచించారు. సుప్రభాతాన్ని పుస్తకంగా ప్రచురించే వారు. ఇంకా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

4. తిరుమల పాపనాశనమందు స్నానం చేస్తే ఏమవుతుంది ?

తెలిసి చేసిన, తెలియక చేసిన సమస్త పాపములు పశ్చాత్తాపముతో మూడు రోజులు స్నానమాచరించిన సమస్త దోషాలు, పాపాలూ పోతాయని శ్రీవేంకటేశ్వర మహత్య్మంలో ఉంది. చిత్తా నక్షత్రం చైత్ర పౌర్ణమి ఉదయం ఆకాశ గంగలో స్నానమాచరించిన, నీటితో కడిగిన మురికిలా పాపాలు పోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

పాలను ఉప్పును తెలీక తొక్కితే పాపం చుట్టుకుంటుందా ? పాలు సమృద్ధిగా ఉన్న ఇంట్లోకి శనీశ్వరుడు దరిద్రదేవత ఎందుకు రారు ?

పాలను త్రొక్కితే పాపం చుట్టుకుంటుందనేది మన పెద్దల మనకు చెప్పిన విషయం .దాని గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి పాలలోనే పుట్టింది. …

2 comments

  1. Om namo venkatesaaya chaala baaga theliyajesaru .Dhanyavaadamulu

  2. Dhulipalla Raghavendra Rao

    తెలియని విషయాలు పంపించారు సంతోషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *