ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా ఇష్టం దానిని వేయాలి.

2. శ్రీ వేంకటేశ్వరస్వామికి :  వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో ధరింపవలెను.

3. ఆంజనేయస్వామికి :  అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ ,సింధూరంతోనూ పూజించాలి. తమలపాకుల మాల వేస్తే చాలా మంచిది.

4. లలితాదేవికి :  క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము. అన్ని రకముల పువ్వులు కలిపిన మాల.

5. సత్యనారాయణస్వామికి : ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం పెట్టాలి. కదంబ పూలమాల వేయవలెను.

6. దుర్గాదేవికి :  మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం. నిమ్మకాయల మాల వేస్తే చాలా మంచిది .

7. సంతోషీమాతకి : పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు నైవేద్యం అంటే ఆమెకు చాలా ఇష్టం.

8. సాయిబాబాకి :  పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం పెట్టాలి. రోజా పూల మాల వేయాలి.

9. శ్రీకృష్ణునకు :  అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించడం ఉత్తమం.

10. శివునకు :  కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యం పెట్టాలి. మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.

11. సూర్యుడుకు :  మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం పెట్టాలి. జిల్లేడు పూల మాల వేస్తే ఆయనకు చాలా ఇష్టం.

12. లక్ష్మీదేవికి : క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజించాలి.

ఇలా అందరి దేవుళ్ళకి ఇష్టమైన నైవేద్యములు సమర్పించి, వారికి ఇష్టమైన పూలమాల సమర్పిస్తే, మీకు ఇష్టమైన కోరికలను కోరుకుంటే అన్ని తీరుతాయి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

రుద్రాక్ష దీపం అంటే ఏమిటి ? రుద్రాక్ష దీపం ఏ రోజు వెలిగించాలి ? రుద్రాక్ష దీపం వెలిగించినందువలన ఫలితం ఏమిటి

ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి. దానిపైన బియ్యం పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ ఆవునేతిని …

7 comments

 1. Nice…

 2. Chala Manchi Vishayam Cheppinanduku Meeku Danyavadhamulu

 3. ఏ ఏ దేవుళ్లకు ఏ ఏ విధమైన పూజలు మరియు
  ఏఏ నైవేద్యము సమర్పించి పూజలు చేస్తే ఆ ఫలితాలను
  మనకు తెలియజేసినందుకు స్వామిజీ అశోక్ గారికి ధన్యవాదాలు
  🙏🙏🙏🙏

 4. Good information 👌👌👌👌 Dhanyavadhamulu

 5. Dhulipalla Raghavendra Rao

  Good information

 6. మల్లికార్జున రావు ఊరందూరు

  Super information

 7. Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *