సరస్వతి దేవి రాయి మీద ఎందుకు కూర్చుంటుంది ? ఆమెకు ప్రక్కన నెమలి హంస ఎందుకుంటాయి

 

బ్రహ్మపత్నియైన సరస్వతి తెల్లని వస్త్రాలు ధరించి శ్వేతపద్మంలో కూర్చుని మాణిక్య వీణను మీటుతూ వుంటుంది. సరస్వతికు శరదృతువు అంటే ఇష్టం. మూలా నక్షత్రం సరస్వతీ నక్షత్రం గా భావిస్తారు. ముత్యాల సరాలు ధరించే ఈమెకు హంస వాహనం, నెమలి పించం ఆమెకు ఇష్టం కూడా. అందరు దేవతలు కమల పుష్పాలలో కూర్చున్నట్లుగా బొమ్మలు (చిత్రాలు) వేస్తారు గదా! కమలపుష్పం నిలువులోతు నీటిలో బురదలోపుడుతుంది. నీటిలో వున్నా కమల పుష్పానికి నీరు అంటుకోవు. నీటికి నానదు. చీకటి అంటే ఇష్టముండదు. వెలుగు వుంటేనే వికసిస్తుంది. అందుకే దీనిని జ్ఞానపుష్పంగా హిందువులు గౌరవిస్తారు వుంటారు.

 

సరస్వతీదేవి రాతిమీద కూర్చుని వుండటానికి ఒక సంకేతం ఉంది. సరస్వతి సర్వవిద్యలకు అధిదేవతగదా! శక్తిసంపదలు స్థిరంకావు. ఏదో ఒక నాటికి హరించుకు పోతాయి. విద్య బండరాయిలా సుస్థిరమైనది. అనే విషయం తెలియపర్చటానికే సరస్వతిని రాతిబండమీద కూర్చోబెడతారు. ఆమె హంసనే వాహనంగా ఎంచుకోవటానికి కారణమేమంటే హంస జ్ఞాన పక్షి, పాలను నీటిని కలిపిన తరువాత ఆ రెంటినీ వేరుచేయటం సాధ్యమా! కాదుగదా! కాని హంస మాత్రమే వేరుచేసి త్రాగుతుందట. అంటే విద్యవల్ల వివేకం. విజ్ఞానం లభిస్తాయని తెలియజేయటానికి ఆమె హంసవాహని అయింది.

నెమలి ఆమెవద్ద ఎందుకుంటుంది అంటే, సమస్త ప్రాణులు ఆడమగ కలిసి సంభోగం చేస్తాయి. కాని నెమలికి సంభోగం వుండదు. పవిత్ర పక్షి యిది. మగనెమలి కంటినీటిని త్రాగి గ్రుడ్డు పెడుతుంది. రతిక్రియ జరుపని పక్షి ఇదొక్కటే. విద్య పవిత్రమైనదని తెలియజెప్పటానికే నెమలిని సరస్వతి వద్ద చిత్రిస్తారు.అందుకే సరస్వతి దేవి ప్రక్కన నెమలి, హంస ఉండి, ఆమె రాతి మీద కూర్చొని ఉంటుంది.

About Ashok Kanumalla

Ahsok

Check Also

మీ కోరికలు నెరవేరాలి అంటే కార్తీక మాసంలో ఏ దానాలు చేయాలో తెలుసుకోండి

  1. బియ్యాన్ని దానం చేస్తే –సకల పాపాలు తొలుగుతాయి. 2. వెండిని దానం చేస్తే – మనశ్శాంతి కలుగుతుంది. …

6 comments

 1. సరస్వతీ దేవి గురించి చాలా మందికి తెలియని విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ గారికి ధన్యవాదాలు

 2. అక్షింతల పార్థసారథి

  Good

  and

  Nice

  Message

 3. Om Saraswati Devi namaha

 4. Wow superrrr explanation given and good information 👌 👌👌👌👌👌

 5. చాల అధ్బుతంగా చెప్పారు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *