తెల్ల జిల్లేడు ( శ్వేతార్క) గణపతిని పూజిస్తే జీవితంలో అన్ని ఆశలు నెరవేరుతాయా

వృక్షజాతిలో తెల్ల జిల్లేడు చెట్టు చాలా విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ తెల్ల జిల్లేడు చెట్టు కు దూరంగా ఉంటారు. జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందని హిందువుల నమ్మకం.

 

తెల్ల జిల్లేడు( శ్వేతార్క ) వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు.తెల్ల జిల్లేడు (శ్వేతార్క) మొక్క మన ఇంట్లో గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయట.

 

కానీ ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదట. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు.

 

తెల్ల జిల్లేడు (శ్వేతార్క) వేళ్ళు గనుక గణపతి రూపాన్ని సంతరించుకుంటే, అది స్వయంభూ శ్వేతార్క(తెల్ల జిల్లేడు) గణపతి అన్నమాట. మరి ఈ శ్వేతార్క (తెల్ల జిల్లేడు) రూపాన్ని ఎలా పూజించాలి అని సందేహం వస్తుంది కదూ! ఈ గణపతికి ఎరుపు రంగు ఇష్టం. ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క( తెల్ల జిల్లేడు) గణపతిని నిలిపి, ఎర్ర వస్త్రం కప్పి, నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి. మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజ చేయాలి.

 

శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని ఎందరో అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా
తెల్ల జిల్లేడు గణపతిని తెచ్చుకొని మంచి ఫలితాలు పొందుతారు అని ఆశిస్తున్నా.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

7 comments

 1. తెల్ల జిల్లేడు ఆకులు, పువ్వుల గురించి
  ‌మనకు తెలియని విషయాలు తెలియజేసినందుకు అశోక్ స్వామిజీగారు ధన్యవాదాలు తెలుపుతున్నాను

 2. Good Info

 3. Good information 👌👌👌👌👌 given sirTq

 4. అక్షింతల పార్థసారథి

  శుభోదయం :
  నువ్వు చేసిన పూజలకు
  ప్రతి ఫలం ఇచ్చిన దేవుడు
  నువ్వు చేసిన పాపాలకు కూడా
  ప్రతి ఫలం ఇచ్చే తీరుతారు.
  🌅🌞🌅🌞🌅🌞

 5. Ohm Gam ganapathaye namah

  • శ్వేతార్క గణపతి గురించి చాల చక్కగా చెప్పారు థన్యవాదములు

 6. Thank you for your information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *