దీపారాధనకు ఏ నూనెతో దీపాన్ని వెలిగించాలి ?దేవుని ముందు కోరుకున్న కోర్కె బైటికి చెబితే తీరదా

దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి అంటే :

దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము. ఆవునెయ్యితో వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వర్యాలూ, అష్టభోగాలూ సిద్ధిస్తాయి. వెండి లేదా పంచ లోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. అలాగే ఆముదంతో వెలిగించి చేసే దీపారాధన వలన దాంపత్య సుఖమూ, జీవిత సౌఖ్యమూ కలుగుతాయి. వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు. శ్రీమహాలక్ష్మికి ఆవు నెయ్యి దీపం, గణపతి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము వారికి చాలా ఇష్టం.

దేవుని ముందు కోరుకున్న కోర్కె బైటికి చెబితే తీరదు ఎందుకో తెలుడుకోండి.

భగవంతుడ్ని పూజించినవారు కోరుకొనే కోర్కె ఖచ్చితంగా ఎంతో బలీయమైనదై ఉంటుంది. అలాగే బహు కష్టమైనదీ, మానవసాధ్యం కానిదీ అయి ఉంటుంది. అటువంటి కోర్కె తీరిందంటే అది ఎంతో ఆనందించతగ్గ విషయం. ఆ కోరిక ధనంకావచ్చు, సుఖముకావచ్చు, పదవీకావచ్చు, చక్కని భర్త లేదా భార్య ఏదైనా కావచ్చు. కోరుకున్న కోర్కెని బయటకు చెబితే విన్న వారు పైకినవ్వుతూ ఆనందంగా చెప్పినా లోలోన జరగకూడదని కోరుకోవచ్చు. అలాంటి కోరికలు జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయచ్చు పైకి కనిపించేదంతా నిజం కాదు. మీకు తెలియకుండానే మీకు శత్రువు లుండవచ్చు, వారు మీ స్నేహితులే కావచ్చు లేదా బంధువులే కావచ్చు , అందుకే చెప్పొద్దొంటారు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

మీ కోరికలు నెరవేరాలి అంటే కార్తీక మాసంలో ఏ దానాలు చేయాలో తెలుసుకోండి

  1. బియ్యాన్ని దానం చేస్తే –సకల పాపాలు తొలుగుతాయి. 2. వెండిని దానం చేస్తే – మనశ్శాంతి కలుగుతుంది. …

10 comments

  1. హరి ఆలేటి

    Good information

  2. ఏ ఏ నూనెలతో మరియు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలను
    తెలియజేసినందుకు స్వామిజీ గారికి ధన్యవాదాలు

  3. Good information 👌👌👌👌👌👍 Tq

  4. చాల బాగా దీపారాధన గురించి చెప్పారు. సంతోషం

  5. అక్షింతల పార్థసారథి

    నేటి తరానికి అర్థమయ్యేలా

    చక్కగా వివరించినందుకు

    మీ సందేశాలు జీవితాన్ని ఎలా

    మలచు

    కోవాలో తెలుపుతున్నాయి

    మీకు ప్రత్యేక అభినందనలు

    అశోక్ కుమార్ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *