Breaking News

కోరికలు తీరాలంటే ఏ శివలింగాన్ని పూజిస్తే ఏ ఫలితం వస్తుంది

 

మనం ఒక్కొక్క లింగాన్ని పూజించి అభిషేకించడం వలన,ఒక్కొక్క ఫలితం ఉంటుందని లింగపురాణం చెబుతుంది. రత్నమయమైన లింగం సంపద లను ఇస్తుంది. రాతితో చేసిన లింగం సర్వసిద్ధులను ఇస్తుంది. ధాతువుల నుంచి, అంటే పాదరసం వంటి వాటితో తయారైన లింగం ధనమిస్తుంది. కొయ్యతో తయారుచేసిన లింగం సర్వభోగాలను కలిగిస్తుంది. మట్టితో చేసిన లింగం, అంటే పార్థివ లింగం అణిమాది సిద్ధులను ఇస్తుంది. శివలింగాలన్నింటిలో రాతిలింగం అభిషేకానికి పూజకు ఉత్తమమైనదని, ధాతు లింగం మధ్యమ మైనదనీ, లింగపురాణం వివరంగా చెప్పింది.వీటిలో 12 రకాల శివలింగములు శ్రేష్ఠమైనవి.అవి

1. దూర్వా కాండ లింగము : దీనిని గరిక కాడలతో చేస్తారు. దీనిని పూజించిన అపమృత్యువు నశించును.

2. గంధ లింగము : రెండు భాగాలు కస్తూరి, నాలుగు భాగాలు చందనము మూడు భాగాలుగా కలిపి గంధ లింగమును తయారుచేయుదురు దీనికి పూజ చేసిన శివసాయుజ్యం కలుగుతుంది.

3. శర్కరా మయ లింగము : దీనికి పూజచేసిన అన్ని సుఖాలు కలుగజేయును

4. పుష్ప లింగం : దీనిని అన్ని రకాల పూలతో నిర్మిస్తారు. ఈ విధంగా నానావిధాలైన సువాసనలు గల పూలతో నిర్మించిన పుష్పలింగాన్ని పూజించినచో రాజ్యాధిపత్యము కలుగును.

5. గోమయ లింగము : స్వచ్ఛమైన కపిల గోమయమును తెచ్చి లింగమును చేసి పూజ చేసిన దానివల్ల ఐశ్వర్యము చేకూరును. దీనికి నేలపైన మట్టిలోన పడిన పేడపనికారాదు. నేరుగా పట్టాలి.

6. రజోమయలింగము : పుప్పొడితో తయారుచేసిన లింగమును పూజించినచో విద్యాధరత్వము సిద్ధించును ఆపైన శివసాయుజ్యము పొందవచ్చును.

7. యవగోధుమ, శాలిజ లింగము: దీనిని యవలు, గోధుమలు, తండులపిష్టముచేత తయారుచేస్తారు. దీనికి పూజ చేసిన సకల సంపదలు కలుగును. పుత్రసంతానం కలుగును.

8. తిలపిష్టలింగము: దీనిని నువ్వులపిండితో తయారుచేస్తారు. దీనిని పూజించినచో ఇష్టసిద్ధి కలుగును.

9. లవణ లింగము : దీనిని హరిదళము, త్రికటుకము మెత్తగా పొడిచేసి ఉప్పుతో కలిపి లింగముగా చేస్తారు. దీనిని పూజించిన వశీకరణ ఏర్పడును.

10. తపోత్ లింగము : దీనిని పూజించిన శత్రువులు నశింతురు. మిత్రుల సహకారం లభించును.

11. భస్మ మయ లింగం : దీనిని పూజించిన సమస్త ఫలితాలు చేకూరును.

12. గురుదత్త లింగము : దానికి పూజ చేసిన ప్రీతిని కలిగించును.

ఇవియే గాక చాలా రకములు అయిన లింగములు పూజిస్తే ఇంకా మంచి జరుగుతుంది. ప్రస్తుతం ఇవి చేసుకొని మీరు ఆనందం పొందుతారు అని ఆసిస్తూ.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ శివలింగాలను పూజిస్తే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి

లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి లభిస్తుంది. కర్పూరాజ లింగం: మానవులకు …

7 comments

  1. Thank u for good information

  2. Good information

  3. మల్లికార్జున రావు ఊరందూరు

    ఓం నమఃశివయా!

  4. Om namah shivaaya

  5. ఏ విధమైన శివలింగములకు ఏవిధంగా
    పూజలు చేయడం వల్ల కలిగే లాభాలను
    స్వామిజీ బాగా తెలిసినందుకు
    కృతజ్ఞతలు తెలుపుతున్నాను.🙏🙏🙏

    • అక్షింతల పార్థసారథి

      Wonder full post

      ఓం నమశ్శివాయ

      సమస్త సన్మంగళాని

      భ వంతు శుభమస్తు

      శుభరాత్రి అశోక్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *